అనంతపురం : నా చావుకు సీఎం జగనే కారణం.. లేఖ రాసి ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నంఅనంతపురం: సీపీఎస్ రద్దు చేయలేదన్న ఆవేదనతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా పెన్నఅహోబిలంలో జరిగింది. ఉరవకొండ మండలం చిన్న ముస్తూరుకు చెందిన ఉపాధ్యాయుడు మల్లేశ్ తన చావుకు సీఎం జగనే కారణమంటూ ఐదు పేజీల లేఖ రాసి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు..జగన్ ఉపాధ్యాయులను మోసం చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దు, 5వ తేదీకల్లా జీతాలివ్వడమే తన చివరి కోరిక అని లేఖలో ప్రస్తావించారు. సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి పెన్నఅహోబిలం ఆలయం పరిసరాల్లో విషపు గుళికలు మింగిన ఉపాధ్యాయుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..
