విజయవాడ, : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్ సోమవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ప్రముఖ చిత్ర కధానాయకులు వెంకటేష్, ‘సైందవ్’ చిత్ర బృందానికి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ అమ్మవారి ప్రసాడాలు, శేషవస్త్రములు, చిత్రపటం అందచేశారు.

previous post