కడప /మైదుకూరు : రాయలసీమలోని రైతు సోదరులందరూ కలిసి రైతుల సమస్యలపై మరియు నీతి హక్కులపై కలిసి ఉద్యమించాలని రైతు సేవ సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి అన్నారు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ను ఇప్పటివరకు అధిక శాతం పాలించిన వారు రాయలసీమ జిల్లాల నుంచి ఎన్నికైన పాలకులైన రాయలసీమ రైతుకు అన్నయ్యమే జరుగుతుందని పట్టణ పరిధిలో రైతులు, రైతు సేవా సమితి పట్టణ నాయకత్వంతో కలిసి రమణ మాట్లాడుతూ కడప, రాయలసీమ జిల్లాలలో కొన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీరు నింపుతున్న ప్రాజెక్టుల నుండి ఆయకట్టురైతుల పొలాలకు పంట కాలువలను ,పిల్ల కాలువలను పూర్తి చేసి రైతుకు నీరు అందించడంలో రాజకీయ పక్షాలు పూర్తిగా విపలమవుతున్నాయని సమాజంలో రైతు బాగుంటే దాని ప్రభావం ప్రతి ఒక్కరి పైన పడుతుందని అయితే ప్రస్తుతప్రపంచంలో వర్ష ప్రభావం సీజన్లో వర్షాలు వస్తే అధికమన్న వస్తున్నాయి, లేకపోతే వర్షం పడకుండానే పొయ్యి రైతును నష్టపరుస్తున్నాయి ఈ ప్రభావం రైతులు నష్టపోవడమే కాకుండా రైతు పండించిన పంటలు సరిగా లేకపోతే దాని ధరల ప్రభావంతో సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా పడుతుందని ఈ ప్రభావం నుండి సమాజం బయట పడాలంటే రైతుకు సాగునీరు అనేది అధిక వర్షం వచ్చిన వర్షం రాకపోయినా ప్రాజెక్టులలో నింపుకొని ఆయకట్టు రైతుకు నీరు అందించగలిగితే రైతు కూడా పంటలను సక్రమంగా పండించి సమాజానికి అందించగలడని రమణ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పూర్తయిన ప్రాజెక్టుల నుండి ఆయకట్టు రైతుకు నీరు అందే విధంగా పిల్ల కాలువలు, రాయలసీమ నడి జిల్లాలలో పారుతున్న నీటిని అవకాశం ఉన్నచోట నూతన ప్రాజెక్టులను నిర్మించుకోగలిగితేనే ఈ సమస్య పరిష్కారానికి కృషి జరుగుతుందని అయితే ప్రస్తుతం ఉన్న పాలకులు ఆ విధానం కాకుండా కేవలం విద్యా, వైద్య, పరిశ్రమల నిర్మాణాలకే కృషి చేస్తున్నారని ఈ సమస్య పరిష్కారానికి భవిష్యత్తులో రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు , సామాజిక వాదులు ఏకమైతేనే సమస్య పరిష్కారం అవుతుందని రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు పట్టణ అధ్యక్షుడు కానగూడూరు రామ్మోహన్, కత్తి నాగిరెడ్డి, మూలే రామాంజనేయరెడ్డి, రామచంద్రుడు, చలపతి తదితరులు పాల్గొన్నారు.
