Tv424x7
Andhrapradesh

మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట కందుల నాగరాజు

విశాఖపట్నం మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు తెలిపారు.అల్లిపురం, చలువతోట ప్రాంతంలో బుధవారం ఉదయం నిర్వహించిన మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.డాక్టర్ బి.ర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకుని ముందుకు వెళ్లాలని అభిలాషించారు.మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని అన్నారు.మత్స్యకారులను ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ మత్స్యకారుల సంఘం సభ్యురాలు చెల్లూరు నూకాలమ్మ,నాగభూషన్, నల్లయ్య, చెల్లూరు బుజ్జి, కృష్ణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

TV4-24X7 News

విజయవాడ టూ తిరుపతి.. ఇకపై నాలుగున్నర గంటలే..

TV4-24X7 News

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

TV4-24X7 News

Leave a Comment