జెడ్పి చైర్మన్ రాంగోవింద రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల ఉమ్మడి జడ్పి సర్వసభ్య సమావేశం
.కడప : ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కార్యదీక్షతో,అంకిత భావంతో పూర్చి చేసి.. ప్రజలకు ఎలాంటి కొరత లేకుండాచూడాలని.వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.శనివారం ఉదయం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో.జెడ్పి చైర్మన్ రాంగోవిందరెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కడప,అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పి సర్వ సభ్య సమావేశం జరిగింది.ఈ సర్వసభ్య సమావేశానికి.వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి తోపాటు,రాష్ట్ర ప్రభుత్వ విప్,జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, జెడ్పి సీఈవో ఓబులమ్మ, ఎమ్మెల్సీలు రాంగోపాల్ రెడ్డి,పి.రామసుబ్బా రెడ్డి,రామచంద్రా రెడ్డి,కమలాపురం,ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు కృష్ణ చైతన్య రెడ్డి,నంద్యాల వరదరాజుల రెడ్డి,డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్, జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, ఎంపీపీలు,వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.కార్యక్రమంలో ముందుగా.పులివెందుల,ఒంటిమిట్ట నూతన జెడ్పిటిసీ సభ్యులుగా ఎన్నికైన మారెడ్డి లతారెడ్డి,అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా మంచి చేసేందుకే అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.ప్రజలకు సంతృప్తి కరమైన కనీస,మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా సమస్యలు లేని జిల్లాగా తీర్చిద్దేందుకు జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు.ఇప్పటి వరకు చేపట్టిన అన్ని అభివృద్ధి పలనులను,గతంలో చేపట్టి ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న పనులను కుడా ప్రణాళిక ప్రకారం పూర్తిచేసేలా చర్యలు చేపట్టడంజరుగుతోందన్నారు.అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో అధికారులతో పాటు గ్రామ,మండల, జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పనిచేయాలన్నారు.జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని ఖరీఫ్ ప్రారంభంలోనే 12 వేల మెట్రిక్ టన్నులు పంపిణీచేసామన్నారు.ఇంకనూ సీజన్ అవసరానికి సరిపడా ఇండెంట్ పెట్టడం జరిగిందన్నారు.ఆర్.ఎస్.కే. లు,డీలర్ల వద్ద యూరియా అందుబాటులో ఉంది. విడతల వారీగా పంపిణీ చేయడంజరుగుతోందన్నారు. జిల్లాఆర్ అండ్ బి సంబంధిత శాఖలలో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.వికలాంగ పెన్షన్లలో అనర్హులకు తొలగించే ప్రక్రియలో.సదరం బోర్డు ద్వారా రీ వెరిఫికేషన్ చేపట్టి నిజంగా అర్హతలు ఉన్న వారికి న్యాయం జరిగేలా చేస్తామన్నారు.నిజంగా అర్హతలు ఉండి నష్టపోతున్నాము అని భావించేవారు.చాలామంది అప్పీలు వేయడం జరిగిందని.విచారణ పూర్తి అయ్యేవరకు పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.సర్వసభ్య సమావేశంలో సభ్యలు లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.సర్వసభ సమావేశంలో సభ్యులు లేవనెత్తినఅంశాలను.పరిశీలించి వచ్చే సమావేశం నాటికి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.జిల్లా యంత్రాంగం,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వైఎస్సార్ కడప జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు.అంతకుముందు అజెండా అంశాల వారీగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికను సమర్పించగా.. పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై అధికారులుసమాధానాలిచ్చారు చక్రాయపేట మండలంలో వర్షపాతం తక్కువగా ఉందని,కరువు మండలంగా ప్రకటించాలని,ఈ ప్రాంతంలో పంటలకు యూరియా అవసరం.చాలా ఉందని,వెంటనే పంపిణీ చేయాలని.ఆ మండల జడ్పిటిసి సంభ్యులు కోరారు.కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లు అందక నానా అవస్థలు పడుతున్నారని.ప్రభుత్వం నుండి బిల్లులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు జెడ్పిటిసీ సభ్యులు సభాధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చారు.జాయింట్ ఎల్.పి.ఎం.రికార్డుల విషయంలో రెవెన్యూ వారి తప్పిదాల వల్ల చాలా మంది రైతు కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కోల్పోతున్నారని.ఈ విషయంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కు తెలియజేసారు.జెడ్పి చైర్మన్ రామ్ గోవింద్ రెడ్డి అలాగే.ఎకరాకు ప్రభుత్వం అందిస్తున్న 100 కేజీల సబ్సిడీ యూరియా ఏ మాత్రం సరిపోవడం లేదని.200 కేజీల యూరియా సరఫరా చేయాలని.సభా ముఖంగాతెలిపారు.ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.జిల్లాలోని ఆర్బికే ఫెసిలిటేషన్ సెంటర్ కు ఇప్పటికీ పాత బోర్డుతోనే.వైఎస్ఆర్ ఆర్బికే ఫెసిలిటేషన్ సెంటర్ అని.వుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ.కడప నగర పరిసరాల్లో కూడా పలు చెరువులు ఉన్నాయని.కొంతమంది ఆక్రమణ దారులు కబ్జాలకు పాల్పడుతున్నారని,ఊటుకురు చెరువులో ఒక ఆయిల్ మిల్ కూడా నిర్వహణలో ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొంతమంది టీచర్లను 20 ఏళ్లుగా డిప్యుటేషన్ పైన డీఈవో కార్యాలయంలో విధులునిర్వహిస్తున్నారని.వారిని తరగతులకు వెళ్లేలా చూడాలని కోరారు.ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి,రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడీ లు మాట్లాడుతూ.రైతు సేవా కేంద్రాల్లో రైతులకు సంతృప్త స్థాయిలో సేవలు అందడం లేదని,క్షేత్ర స్థాయిలో అధికారులు గమనించాలని సభా దృష్టికి తెచ్చారు. అలాగే.అనర్హులైన పెన్షనర్లను లబ్ధిదారుల జాబితా నుండి తొలగించే ప్రక్రియచేపట్టడంలో.చాలామంది నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని తెలిపారు.ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.గ్రామాల్లో రైతులకు వ్యవసాయ సాగు, ఎరువుల యాజమాన్యంపై విస్తృత స్థాయిలో అవగాహనకల్పించాలన్నారు.అధిక మోతాదులో ఎరువులు వాడటం.కూడా అనేక అనర్థాలకు దారితీస్తుందని,వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.అలాగే.సర్వసభ్య సమావేశంలో లేవనెత్తినసమస్యలను.తర్వాత జరిగే సర్వసభ్య సమావేశం లోపు.పరిష్కారం చూపాలని అధికారులకు తెలిపారు.కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ.నియోజకవర్గంలోని ఎల్లటూరు,ఎర్రబల్లె రహదారుల పరిస్థితి సరిగా లేదని,ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించాలనితెలియజేసారు.చెన్నూరు పట్టంలో పెండింగ్ లో ఉన్న సర్వీస్ రోడ్డు సమస్యను తీర్చాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సమావేశానికి వైఎస్ఆర్,అన్నమయ్య జిల్లాల అధికారులు,ప్రజాప్రతినిధులు,తదితరులు హాజరయ్యారు.