Tv424x7
Andhrapradesh

నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. స్వయంగా పింఛన్లు అందించనున్న చంద్రబాబు

సెప్టెంబర్ నెల పింఛన్ల కోసం రూ.2746 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా 63.61 లక్షల మందికి పింఛన్ల పంపిణీ

అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించనున్న సీఎం చంద్రబాబుబోయనపల్లెలో స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించనున్న సీఎంసీఎం చంద్రబాబు ఈరోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ‘పేదల సేవ’ కార్యక్రమంలో భాగంగా రాజంపేట మండలంలోని బోయనపల్లె గ్రామానికి వెళ్లి, ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇళ్లకే స్వయంగా పింఛన్లు అందజేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకం కానున్నారు.రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు రూ.2746.52 కోట్ల నిధులను గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారు.సీఎం చంద్రబాబు తన రాజంపేట పర్యటనలో భాగంగా దోబీఘాట్‌ను సందర్శించి రజకులతో మాట్లాడతారు. వారికి పలు ప్రభుత్వ పథకాలను అందజేస్తారు. అనంతరం తాళ్లపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లతో, పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమవుతారు. సాయంత్రం హెలికాప్టర్‌లో ఉండవల్లిలోని తన నివాసానికి తిరిగి చేరుకుంటారు.ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పాత పింఛన్లతో పాటు కొత్తగా మంజూరైన 7,872 మంది స్పౌజ్ పెన్షన్ లబ్ధిదారుల కోసం అదనంగా రూ.3.15 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.32,143 కోట్లు కేటాయించిందని, ఇది దేశంలోనే రికార్డు అని ఆయన పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో మరింత పారదర్శకత కోసం లబ్ధిదారుల జియో-కోఆర్డినేట్స్‌ను కూడా నమోదు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Related posts

కడప జిల్లాలో యువకుడి ఆత్మహత్య

TV4-24X7 News

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

TV4-24X7 News

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ప్రభావం లేదు

TV4-24X7 News

Leave a Comment