కడప /పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ అన్వర్ భాష ఆధ్వర్యంలో బూత్ నెంబర్ 59 మరియు 13 14 వార్డు పరిధికి సంబంధించిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా పెన్షన్లను పంపిణీ చేశారు. అంతేగాక మంచానికి పరిమితమైన వికలాంగునికి 15000 రూపాయలు పెన్షన్ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల పెన్షన్లను తీసివేశారని ప్రతి పక్ష పార్టీ ఆరోపణను ఆయన ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు చెంద వలసిన అన్ని రకాల పథకాలను తూచా తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేస్తారని గత ప్రభుత్వం కంటే పూర్తిస్థాయిలో పేదలకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా న్యాయం జరుగుతుందని తెలిపారు.

previous post