అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ వద్ద ఉన్న దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలలో వైసిపి మాజీ సమన్వయకర్త విఆర్ .రామిరెడ్డి, నాయకులు కార్యకర్తలతో కలిసి మంగళవారం నాడు పాల్గొన్నారు. అనంతరం వైసిపి మాజీ సమన్వయకర్త విఆర్. రామిరెడ్డి, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విఆర్. రామిరెడ్డి మాట్లాడుతూ మహానేత మహా నాయకుడు దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను ప్రతి ఎమ్మెల్యే, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ ప్రధానులు కూడా ఆ మహానేతను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క రాజశేఖర్ రెడ్డి కి దక్కిందని జాతి ఉన్నంతవరకు ఈ సమాజం ఆ మహానేతను గుండెల్లో పెట్టుకొని ఆదర్శంగా తీసుకుంటున్నారని తాడిపత్రి వైసిపి మాజీ సమన్వయకర్త విఆర్ రామిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి వైసిపి మాజీ సమన్వయకర్త విఆర్ రామిరెడ్డి, పి .శివ శంకర్ రెడ్డి, వై .నాగేశ్వర్ రెడ్డి, శివారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, చిన్న ఎక్కలూరు ఓబులరెడ్డి, తిమ్మాపురం చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణ, రవికుమార్ శెట్టి, చిన్న యాదవ్, ఇంకా తదితర వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

previous post