ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29 వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది . వినాయక విగ్రహాలు ఊరేగింపు గా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సీఐ మైకు తీసుకొని బహిరంగంగా “వెధవల్లారా “అని హిందువులను తిట్టడం జరిగింది . అదే రోజు రాత్రి ఒంటిగంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సీఐ విచక్షణా రహితంగా కొట్టడం జరిగింది. అంతేకాకుండా 31వ తేదీన సోగనూరు రోడ్డు ఆంజనేయ స్వామి గుడి వినాయకుడు ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీగా ఊరేగింపుగా రామస్వామి గుడి వద్దకు రాగా సీఐ తన సిబ్బందితో వచ్చి, ఆటో డ్రైవర్ని బూటు కాళ్లతో విచక్షణ రహితంగా తన్ని గాయపరిచారు. సిఐ దౌర్జన్య చర్యలతో హిందువులు తిరగబడాల్సిన పరిస్థితిని కల్పించాడు. సీఐ బూటు కాళ్ళతో తన్నుతూ చేసిన దౌర్జన్యాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సిఐ శ్రీనివాసుల పై జిల్లా ఉన్నతాధికారులు సుమోటో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉంది. సిఐ ప్రశాంతంగా జరుగుతున్న ఊరేగింపులో అసహనానికి లోనై దౌర్జన్యం చేయడం జరిగింది.ఈ ఘటన వల్ల హిందువులు చాలా బాధ పడ్డారు.

previous post