రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 51 వ పుట్టిన రోజు సందర్భంగా స్థానిక పడమటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైయస్ఆర్ టిఎఫ్ టీచర్ ఫెడరేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా పాల్గొన్న మున్సిపల్ ఇంచార్జ్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ హాల్ గంగాధర రెడ్డి, కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్, కో ఆప్షన్ మెంబర్ చంద్రమౌళి, టీచర్ చలమారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంకటనాథ్, ప్రభాకర్ రెడ్డి, రామిరెడ్డి, పాలెం ప్రతాప్, రవిశంకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
previous post

