కడప జీల్లాజమ్మలమడుగు లో జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు హెచ్చరిక. రైతులకు అందాల్సిన ఎరువులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే చర్యలు తప్పవని జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జమ్మలమడుగు పట్టణంలోని ఎరువుల దుకాణాలలో జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.రైతుల పాస్ బుక్కులు చూసి ఎన్ని ఎకరాలకు ఎంత మేర అవసరం ఉంటుందో, ఆ మేరకు మాత్రమే విక్రయించాలని డి.ఎస్పీ డీలర్లకు సూచించారు. విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించాలని డి.ఎస్పీ తెలిపారు.దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. లైసెన్స్, విక్రయ రికార్డులను తనిఖీ చేశారు. యూరియా, ఫాస్ఫెట్, నత్రజని తదితర ఎరువులను అధికధరలకు విక్రయిస్తే, షాపులు సీజ్ చేయడంతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జమ్మలమడుగు డి.ఎస్.పి హెచ్చరించారు.జమ్మలమడుగు అర్బన్ సి.ఐ పి.నరేష్ బాబు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.

previous post