17 ఏళ్ల తర్వాత గావ్లిముంబై అండర్‌వర్ల్డ్‌లో డాన్‌గా పేరుగాంచినప్పటికీ, అనంతరం రాజకీయ రంగంలో అడుగుపెట్టిన అరుణ్ గావ్లి, 17 ఏళ్ల జైలు జీవితం అనంతరం బయటకు వచ్చాడు.
నాగ్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, గావ్లి మంగళవారం జైలు గేట్ దాటి బయటకు వచ్చాడు.
2007లో శివసేన కార్పొరేటర్ కమలాకర్ జంసండేకర్ హత్యకేసులో అరుణ్ గావ్లిని దోషిగా తేల్చి, జీవిత ఖైదు శిక్ష విధించారు. అప్పటి నుండి అతను జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.గావ్లి జైలు నుంచి బయటపడగానే, అతని కుటుంబసభ్యులు, అనుచరులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పూలమాలలు, డప్పులతో ఆయనకు ఘన స్వాగతం లభించింది.