కడప జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (APPSA) కడప జిల్లా ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వినతులను శ్రద్ధగా విన్న మంత్రివర్యులు, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.త్వరలోనే APPSA రాష్ట్ర కమిటీతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, సాధ్యమైనంత వరకు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.

previous post