కర్నూలులో ఆర్టీసీ డ్రైవర్ అయిన తండ్రిని హత్య చేసిన కొడుకు, ఉద్యోగం కోసమే చంపినట్లు పోలీసుల అనుమానం
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తిలో మంగళవారం రాత్రి నిద్రపోతున్న రామాచారి అనే వ్యక్తిని అతడి కొడుకు వీరస్వామి రోకలి బండతో తలపై కొట్టి చంపేశాడు. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో రామాచారి డ్రైవర్గా పనిచేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం కోసం తండ్రిని కుమారుడు హతమార్చి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారిస్తున్నారు