Tv424x7
Andhrapradesh

తల్లికి వందనం డబ్బు అడగడానికి వెళ్లిన వారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి*

గాయపడ్డ బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించిన 108 సిబ్బంది

అన్నమయ్య :తల్లికి వందనం అడిగిన వారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బుధవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం లోని, బి.కొత్తకోట మండలం, గుమ్మసముద్రం గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. ఒడిగిలవారిపల్లికి చెందిన నాగభూషణం, అనురాధ, శంకరప్ప తదితరులు గుమ్మసముద్రం లోని సచివాలయానికి తల్లికి వందనం డబ్బు పడిందా.. లేదా..? అని అడగడానికి వెళ్లారు. డబ్బు పడిందా లేదా అని మాట్లాడడంతో ఆగ్రహించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ దాడి చేసి ముగ్గురిని గాయపరిచాడు. గాయపడ్డ వారిలో ఒడిగిలవారి పల్లెకు చెందిన నాగభూషణం, అనురాధ, శంకరప్ప ఉన్నారు. బాధితులను బి కొత్తకోట 108 సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

రెండో జాబితా సిద్ధం చేసిన జగన్….

TV4-24X7 News

నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం..?

TV4-24X7 News

ఢిల్లీకి వెళ్తావా జగన్!. పద నేనూ వస్తా….!

TV4-24X7 News

Leave a Comment