Tv424x7
Telangana

రేపు రేషన్‌ దుకాణాలు బంద్‌.

తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపు.

తెలంగాణ రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని డీలర్లు డిమాం డ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌ బాబు మాట్లాడుతూ..

కాంగ్రెస్‌ తమకు నెలకు రూ.5వేల కనీస గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్‌ పెంచుతామని హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడిచినా తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వ బియ్యం కమీషన్‌ బకాయిలతో పాటు పదేళ్లుగా పేరుకుపోయిన పాత బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు.

రేషన్‌ డీలర్ల కుటుంబాలకు హెల్త్‌ కార్డులు, దుకాణాల అద్దె, బియ్యం దిగుమతి చార్జీలనూ ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు.

Related posts

ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు

TV4-24X7 News

రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడితో సీఎం రేవంత్‌ చర్చ

TV4-24X7 News

తెలంగాణ అప్పు ఎంతంటే..?

TV4-24X7 News

Leave a Comment