మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గాయత్రి గుట్ట సమీపంలోని జాతీయ రహదారి పై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపింది. కారులో అనిశ్చిత స్థితిలో ఉన్న శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కురవి మండలం తాట్యా తండాకు చెందిన రాంబాబు (28)గా గుర్తించారు.
ఇది హత్యా, ఆత్మహత్యా, లేక సహజ మరణమా (గుండె పోటా) అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం విచారణ ప్రారంభించింది.