Tv424x7
Telangana

ఆ నగర వాసులకు ముఖ్య సమాచారం – నీటి సరఫరా నిలిపివేత

హైదరాబాద్‌లో రెండు రోజుల నీటి సరఫరా నిలిపివేత.

గోదావరి నీటి సరఫరా పైపులైన్‌ల నిర్వహణ పనుల కారణంగా రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) అధికారులు ప్రకటించారు.

సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు మొత్తం 48 గంటల పాటు నీటి సరఫరా ఉండదు.

గోదావరి నీటిని పంప్ చేసే ముర్ముర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో నిర్వహణ పనుల కోసం పంపింగ్ మెయిన్‌ను మూసివేయనున్నారు.దీంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా ఆగనుంది. అధికారులు ప్రజలు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.

Related posts

సస్పెండెడ్ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పైన కేసు నమోదు..

TV4-24X7 News

నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం..

TV4-24X7 News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మేయర్..!

TV4-24X7 News

Leave a Comment