రొయ్యూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా మళ్లీ చెలరేగింది. అర్ధరాత్రి వేళల్లోనే నదిలో తవ్వకాలు జరుగుతుండగా, పగలు మాత్రం స్టాక్ పాయింట్ల పేరిట ఇసుక బంకర్లు కనిపిస్తున్నాయి.
స్థానిక సమాచారం మేరకు ప్రతి లారీకి ₹25,000 పైగా వసూలు చేస్తూ మాఫియా చెలరేగుతోంది. దీంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు.
ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన తహసిల్దార్ స్వయంగా కనుసైగలతోనే మైనింగ్ కొనసాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, రొయ్యూరులో డాన్ సురేష్ హవా కొనసాగుతూనే ఉంది. అతని ఆధిపత్యంలోనే అన్ని తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు చెప్పుకొస్తున్నారు.
ఇసుక రవాణాలో నకిలీ బిల్లుల రాజ్యం నడుస్తుండగా, వాటిని అసలైన బిల్లుల్లా చూపించి అధికారులను, ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఫలితంగా, ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పొడుస్తూ, ప్రజలకు ఇసుక కొరత, ధరల పెరుగుదల, పర్యావరణ సమస్యలు ముప్పు తెస్తున్నాయి.