హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా పెద్ద ఎత్తున పట్టుబడింది. చర్లపల్లిలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ అధికారులు దాడులు నిర్వహించారు. సమాచారం ఆధారంగా చేసిన తనిఖీల్లో 32 వేల లీటర్ల రా మెటీరియల్ స్వాధీనం అయింది. ఇది మెఫెడ్రోన్ (MD డ్రగ్స్) తయారీలో ఉపయోగించే పదార్థమని పోలీసులు వెల్లడించారు. దీని విలువ దాదాపు ₹12 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఆపరేషన్‌లో 13 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారుల నెట్‌వర్క్‌ను గుట్టురట్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. చర్లపల్లిలోని ఫ్యాక్టరీ నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు విచారణలో బయటపడింది.
ముంబైలో ఓ బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో ఈ రాకెట్ తాలూకు గుట్టు రట్టు కావడంతో చర్లపల్లిలో దాడులు జరిగాయి. ఫ్యాక్టరీను కేవలం కెమికల్ యూనిట్‌గా నడుపుతున్నట్టు చూపించి వాస్తవానికి డ్రగ్స్ తయారీ కేంద్రంగా వాడుతున్నారని అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో మరోసారి దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా విస్తృతి బయటపడింది. అయితే, స్వాధీనం అయిన పదార్థాల నిజమైన విలువపై వివిధ వర్గాల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.