ఎర్ర సముద్రం లోపల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ అయ్యాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
దీనివల్ల ఆసియా, యూరప్ ప్రాంతాల్లో తమ Azure సర్వీసులకు అంతరాయం కల్గుతుందని పేర్కొంది. రిపేర్ చేసేందుకు సమయం పడుతుందని, రోజువారీ అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్లౌడ్ సేవలందించే సంస్థ Azure.
ఆ కేబుళ్లను హౌతీలు కట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.