న్యూఢిల్లీ…
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపు జరగనుంది. ఇందులో భాగంగా నేడు ప్రతిపక్ష ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటు వేయే విధానంపై వారికి వివరాలు అందించి, మధ్యాహ్నం 2.30 గంటలకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో మాక్ పోలింగ్ చేపట్టనున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇస్తారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సి.పి. రాధాకృష్ణన్ (మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడుకు చెందిన సంఘ్ పరివార్ నేత)
Vs.ఇండియా బ్లాక్ అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) మధ్య ప్రత్యక్ష పోటీ జరుగుతుంది.
పార్లమెంట్ హౌస్ వసుధలోని రూమ్ నెంబర్ F-101లో పోలింగ్ జరుగుతుంది.
⏰ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగగా,📊 సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు.మొత్తం 788 మంది ఎంపీలు ఎలక్టోరల్ కాలేజీలో ఉండగా, ప్రస్తుతానికి 781 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
🔹 రాధాకృష్ణన్ – సంఘ్ పరివార్ నేత
🔹 సుదర్శన్ రెడ్డి – న్యాయ నిపుణుడు, మాజీ సుప్రీంకోర్టు జడ్జి
➡️ ఈ ఎన్నికలో రాజకీయ శక్తి Vs. న్యాయనిపుణ్యం మధ్య పోటీగా విశ్లేషకులు చెబుతున్నారు.
అనూష