Tv424x7
Andhrapradesh

ఏపీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

ఏపీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై ఆర్ధిక శాఖ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.ఈ నెల 15 నుంచి రెగ్యులరైజేషన్ కోసం కాంట్రాక్టు ఉద్యోగుల నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు. సంక్రాంతిలోపు రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. కాగా ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పని చేస్తున్నారు. తమను రెగ్యులర్ చేయాలని వీరు ఎప్పటినుంచే డిమాండ్ వినిపిస్తున్నారు. సీఎం జగన్‌ను కలిసి తమను రెగ్యులర్ చేయాలని కోరారు. దీంతో వారిని రెగ్యులర్ చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి గత నెలలో ఉత్తర్వు జారీ చేశారు. తాజాగా రెగ్యులరైజేషన్‌పై గైడ్ లైన్స్ విడుదల చేశారు.

Related posts

ప్రేమికుల దినోత్సవం ముందు రోజున యువతి దారుణ హత్య

TV4-24X7 News

ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు.. వేసవి సెలవుల్లో మార్పు..!

TV4-24X7 News

యూజీడి వర్క్స్ ను ప్రారంభించిన కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment