Tv424x7
Andhrapradesh

రెండో జాబితా సిద్ధం చేసిన జగన్….

వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థులుగా రెండో జాబితాలో పలువురి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది… మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని తెలుస్తోంది. అలాగే కొవ్వూరు (ఎస్సీ) ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం (ఎస్సీ)కి బదిలీ చేసే యోచనలో ఉంది. మంత్రి.. అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూ్‌పను తప్పిస్తారని అంటున్నారు. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనూరాధను బరిలోకి దించే అవకాశాలున్నాయి. మంత్రులు జోగి రమేశ్‌ (పెడన), అంబటి రాంబాబు (సత్తెనపల్లి)ను వేరే స్థానాలకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మార్చటం లేదా లోక్‌సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే పి.దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగా గీతకు టికెట్‌ ఇవ్వొచ్చని తెలుస్తోంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను, అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని లోక్‌సభకు పంపే అవకాశాలున్నాయి.*సీట్లు మార్పు తప్పదా :*వీరితో పాటుగా సీట్లు మార్చే స్థానాల్లో పలువరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శెట్టి ఫాల్గుణ (అరకు-ఎస్టీ), కన్నబాబురాజు (యలమంచిలి), గొల్లబాబూరావు (పాయకరావుపేట) పి.ఉమాశంకర్‌ గణేశ్‌ (నర్సీపట్నం), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ (పత్తిపాడు), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), తలారి వెంకటరావు (గోపాలపురం-ఎస్సీ), రక్షణనిధి (తిరువూరు-ఎస్సీ), సింహాద్రి రమేశ్‌బాబు (అవనిగడ్డ), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్‌), , కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు), వి.వరప్రసాదరావు (గూడూరు), ఆర్థర్‌ (నందికొట్కూరు), సుధాకర్‌ (కోడుమూరు), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకట్రామిరెడ్డి (గుంతకల్‌), తిప్పేస్వామి (మడకశిర), శ్రీధర్‌రెడ్డి (పుట్టపర్తి), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), శ్రీనివాసులు (చిత్తూరు), వెంకటగౌడ (పలమనేరు)లను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.. జగన్ నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Related posts

సచివాలయంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశం

TV4-24X7 News

యువగళం @ 226 రోజులు.. పాదయాత్రలో లోకేశ్‌తో కలిసి నడిచిన నారా భువనేశ్వరి, వసుంధర

TV4-24X7 News

ద్రోణంరాజు శ్రీనివాస్ లోటు తీరనిది నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

TV4-24X7 News

Leave a Comment