Tv424x7
Andhrapradesh

వాలంటీర్ జీతాలు పెంపు 5 వేల నుంచి రూ.5,750

ఏపీ వాలంటీర్లకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీ వాలంటీర్ల జీతాలు పెంచబోతున్నట్లు ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ…జగన్ పుట్టినరోజు సందర్భంగా వాలంటీర్లకు బహుమానం ప్రకటిస్తున్నామన్నారు. జనవరి 1వ తేదీ నుంచి వాలంటీర్లకు గౌరవ భృతిని 5 వేల నుంచి రూ. 5,750 పెంచుతున్నామని ప్రకటన చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.మామను వెన్నుపోటు పోడిచించింది చంద్రబాబే… భార్యలను మోసం చేసింది పవన్ కళ్యాణ్ అంటూ ఫైర్‌ అయ్యారు. తల్లిని, చెల్లిని జగన్ ఎప్పుడు గౌరవంగా చూస్తున్నారన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అయితే… నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు ఉన్న తరుణంలోనే.. వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

Related posts

దక్షిణాదిలో దంచికొడుతున్న ఎండలు

TV4-24X7 News

పదవీ విరమణ పొందిన 10 మంది పోలీస్ అధికారులు

TV4-24X7 News

అన్నమయ్యజిల్లా, రాజంపేటలోని గాంధీ విగ్రహం కూడలి నందు బిజెపి పార్టి శ్రేణుల సంబరాలు

TV4-24X7 News

Leave a Comment