AP: సీఎం జగన్ కాన్వాయ్పై ఓ వ్యక్తి రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పులివెందుల పర్యటనలో సీఎం కాన్వాయైపై గురిజాలకు చెందిన దివ్యాంగుడు అప్పయ్య రాయి విసిరాడు. అది ఇంటెలిజెన్స్ డీఎస్పీ వాహనంపై పడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. పింఛనుకు దరఖాస్తు చేసుకుని 4 నెలలైనా రాకపోవడంతోనే రాయి విసిరినట్లు తెలుస్తోంది.
