దిల్లీ: భాజపాకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన విషయం తెలిసిందే..ఈ సారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు ‘భారత్ న్యాయ యాత్ర (Bharat Nyay Yatra)’ చేపట్టనున్నట్లు కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది..వచ్చే ఏడాది జనవరి 14 నుంచి మార్చి 20వ తేదీ వరకు ఈ యాత్ర నిర్వహించనున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. మణిపుర్ (Manipur) నుంచి ముంబయి (Mumbai) వరకు మొత్తం 6,200 కి.మీ మేర దీనిని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలతో ఆయన ముచ్చటించనున్నట్లు పేర్కొన్నారు..

previous post