Tv424x7
Andhrapradesh

సంగటితిమ్మాయ్యపల్లె లో ఉచిత పశు వైద్య శిబిరం

సంగటితిమ్మాయ్యపల్లె లో ఉచిత పశు వైద్య శిబిరం రిలయన్స్ ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖ సంగటి తిమ్మాయ్యపల్లె వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి Dr పనింద్ర రెడ్డి గారు పాల్గొని పశువులకు ఉచిత వైద్యమును అందించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పనింద్ర రెడ్డి గారు మాట్లాడుతూ పశు రైతు లు వైద్యుల సూచన మేరకు మినరల్ మిక్షర్ ఇచ్చినట్లు అయితే పశువులు సకాలంలో ఎదకు వచ్చి కట్టు నిలుస్తుంది. రైతులు ఎద లక్షణాలు గమనిస్తూ లక్షణాలు కనబడగానే రైతులు ఎద సూదులు పశువులు ఆసుపత్రిలో వేయించుకోవాలని రైతులు పశువుల తో పాటు పశువైద్యశాల ను సంప్రదించాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 40 పశువులు, 185 జీవాల కు వైద్యము అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రతినిధి అమీర్ గారు మాట్లాడుతూ రైతులు వాతావరణ వర్షము సమాచారము వ్యవసాయ పశు పోషణ సమాచారం కోసం ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించి ఉచిత సలహాలు మరియు సూచనలను పొందవచ్చని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి A పనింద్ర రెడ్డి గారు , మరియు సిబ్బంది రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రతినిధి అమీర్ మరియు సంగటితిమ్మాయ్యపల్లె గ్రామ రైతులు పాల్గొన్నారు .

Related posts

AP ఇన్ చార్జ్ DGPగా శంఖబ్రత బాగ్చీ

TV4-24X7 News

దోష నివారణకు నేడు తిరుమలలో శాంతి హోమం

TV4-24X7 News

రేపటి నుంచి EAPCETAP

TV4-24X7 News

Leave a Comment