Tv424x7
Andhrapradesh

పులివెందులలో వివాహిత ఆత్మహత్య

ఆన్లైన్ గేమ్స్ తో రెండు లక్షల అప్పు

భర్తకు తెలుస్తుంది అని ఆత్మ హత్యకు పాల్పడిన వైనంఆన్లైన్ గేమ్స్ ఆడి రెండు లక్షలు రూపాయలు అప్పు చేసిన వివాహిత భర్తకు తెలిస్తే గొడవలు అవుతుంది అన్న భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పులివెందులలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే పులివెందులలోని హరిప్రియ హెచ్ పీ గ్యాస్ సందులో నివసిస్తున్న షేక్ రేష్మ అనే వివాహిత సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకుంది.ప్రొద్దుటూరు రామేశ్వరం గంగానగర్ కాలనీకి చెందిన రేష్మ ను దాదాపు నాలుగేళ్ల క్రితం పులివెందులకి చెందిన మహమ్మద్ ఇసాబ్ కి ఇచ్చి వివాహం చేశారు.వీరికి ఒకటి నర్ర సంవత్సరం పాప వుంది. ఆన్లైన్ లో గేమ్ లాడుతు డబ్బులు పోగొట్టుకున్న రేష్మ రెండు లక్షల రూపాయలు అమే చెల్లెలు షమీన దగ్గర తీసుకుంది. ఈవిషయం భర్తకు తెలుస్తుంది అన్న భయంతోనే ఉరి వేసుకుంది అని,ఈవిషయం గురించి సంఘటన స్థలంలో నా బంగారు అమ్మి డబ్బులు కట్టు అని రాసిన లెటర్ లభించింది అని పోలీస్ లు తెలిపారు.లెటర్ ఆధారంగా రేష్మ తల్లి మహబూబ్ జాన్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీస్ లు తెలిపారు.ఆత్మహత్యనా లేక హత్యనా ?రేష్మ నిజంగా ఆత్మహత్య చేసుకుందా లేక హత్య కు గురి అయిందా అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లో వుండే రేష్మ ఆన్లైన్ గేమ్స్ లో రెండు లక్షలు పోగొట్టు కొని అప్పు చేసిన ఇంత కొంత సొమ్ముకు ఆత్మహత్య చేసుకుందా అని అనుమానం వ్యక్తం అవుతోంది. బంగారు అమ్మి రెండు లక్షలు కట్టమని లెటర్ రాసింది అంటే అంత సొమ్ము వున్నప్పుడు ఆ డబ్బును కట్టే స్థోమత వుండి కూడా ఉరి వేసుకొని వున్నింటుందా అని ,కనీసం విశయం తల్లి కైన చెప్పి వుంటుంది కదా అని అనుమానాలు కూడా వ్యక్తవుతున్నాయి.హత్య ను ఆత్మ హత్య గా మార్చడానికి ,కేవలం విశయం తప్పు దోవ పట్టించడానికి ఆన్లైన్ గేమ్స్ అప్పలు అని సాకులు పెట్టినట్టు ,రాజకీయ బలంతో మృతురాలి కుటుంబ సభ్యుల నోరు మూయించి ఉండ వచ్చు అని కూడా అనుమానాలు కలుగుతున్నాయి.అది కాకుండా రేష్మ గర్భవతి అని స్థానికులు చర్చించు కుంటున్నట్లు తెలిసింది.ఏది ఏమైనప్పటికీ ఒక వివాహిత నిండు ప్రాణం కోల్పోయింది.

Related posts

ఇప్పట్ల గ్రామంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం

TV4-24X7 News

నేటి నుంచి అంగన్వాడీల్లో ఆధార్ క్యాంపులు

TV4-24X7 News

పశుగ్రాసం కాల్చడం చాలా దుర్మార్గపు చర్య :- జనసేన పార్టీ డేరంగుల జగదీష్

TV4-24X7 News

Leave a Comment