Tv424x7
Andhrapradesh

చిన్నసింగనపల్లెలో 12,14వ తేదీ గజ పూజ కార్యక్రమం

కడప: మైదుకూరు/దువ్వూరు మండల పరిధిలోని చిన్నసింగనపల్లె గ్రామంలో ఈనెల 12వ తేదీ మరియు 14వ తేదీ మహిళలు చే కోలాటం గజపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. జైశ్రీరామ్ కోలాట గురువులు నేర్పిన మహిళల కోలాటం చిన్న సింగనపల్లి గ్రామంలో గత 3 నెలల నుంచి రెండు బృందాలుగా మహిళలకు కోలాటం నేర్పించారు. ఈ సందర్భంగా సోమవారము కోలాటం గురువులు రామచంద్రయ్య, నాగార్జునలు మాట్లాడుతూ కోలాటం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కోలాటం అనగా పురాతన కళలను గుర్తు చేస్తూ మన హిందూ సాంప్రదాయ పద్ధతులను, కట్టు, బొట్టు మన ధర్మాన్ని తెలియజేస్తూ ప్రజలను మేల్కొనపడడమే, ఈ కోలాటం యొక్క సారాంశం అని తెలిపారు. ఇలా గత మూడు నెలల నుంచి శ్రీ శ్రీ రామ మహిళా కోలాట బృందం, మరియు శ్రీ వెంకటేశ్వర మహిళా కోలాట బృందం పెద్ద ఎత్తున మహిళలు నేర్చుకున్నారు. కోలాటం నేర్చుకోవడం పూర్తయిన సందర్భంగా ఈనెల 12వ తేదీ శ్రీ శ్రీరామ కోలాట మహిళా బృందం వారు, అలాగే 14వ తేదీ శ్రీ వెంకటేశ్వర మహిళా కోలాటం బృందం వారు గజ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువులు, గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.12 వతేదీ సాయంత్రం ఐదున్నర గంటల నుంచి కోలాటం గజ పూజ కార్యక్రమం జరుగురని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. కావున మండలంలోని కోలాటం అభిమానులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు హాజరుకావాలని చిన్న సింగన పల్లె గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు

Related posts

పవన్ కోసం వరుణ్ తేజ్ నేడు ప్రచారం

TV4-24X7 News

తిరుపతిలో ఎక్స్ పైర్ డేట్ దాటిన మద్యం అమ్మకాలు..!

TV4-24X7 News

మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో సీతoరాజు సుధాకర్ మరియు విల్లూరి

TV4-24X7 News

Leave a Comment