దువ్వూరు : రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గామార్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు తెలిపారు. శుక్రవారం మండలంలోని చిన్న సింగన పల్లెలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. రోగులకు జగ నన్న ఆరోగ్య సురక్ష కిట్లను ఆయన అందిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే పరమావధిగా ప్రజల చెంతకే వైద్య సేవలు అందించి రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్ర దేశ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జగ నన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిబిరంలో 503 మంది రోగులకు డాక్టర్లు రోషిని ,గురువయ్య , శ్రీలత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మం దులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్వో మల్లేష్, ఈవో పీఆర్డి నాగేంద్ర బాబు,హెల్త్ సూపర్వైజర్లు సువర్ణ, రాజ గోపాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

previous post