దువ్వూరు,మేజర్ న్యూస్ :దువ్వూరు మండలం లోని చిన్న సింగన పల్లె గ్రామంలో శ్రీ శ్రీరామ మహిళా కోలాట బృందం చిన్న సింగన పల్లెలో గజపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గత 100 రోజుల నుండి కోలాటంను గురువులు ఏ. రామచంద్రుడు,నాగార్జున ల ఆధ్వర్యంలో మహిళలకు కోలాటం నేర్పించారు. గ్రామంలో శ్రీ శ్రీ రామ మహిళా కోలాట బృందం వారు దాదాపు 40 మంది పిల్లలు, మహిళలకు కోలాటం నేర్పించ డం జరిగిందని, వీరికి కోలాటం లో పూర్తిస్థాయి గా నైపుణ్యం తీసుక రావడం జరిగిందని గురువు రామచంద్రుడు వివరిం చారు. శుక్రవారం రాత్రి పూజ కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. సమాజంలో మహిళలు అన్ని స్థానాల్లో ముందుండారని, కళా నై పుణ్యంలో స్త్రీలు, పురుషుల కన్నా తక్కువ ఏమి కాదని ఈ కళలకు నిదర్శమని ఆయన కొనియా డారు. కోలాటం వేసే పర్ణశాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు .ఈ కోలాటం పండుగ వాతావరణంలానిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించటానికి గ్రామస్తులే కాకుండా మండలవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

next post