Tv424x7
Andhrapradesh

జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్’: నారా లోకేష్

ఆమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని… వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు..ఓడినా విచారం లేదంటూ ఇప్పటికిప్పుడు సంతోషంగా దిగిపోతానన్న జగన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ ఇక ఉండరని.. ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘హ్యాపీగా దిగిపోతా.. ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ’ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తను లోకేష్ షేర్ చేశారు. ’56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’ అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్టు ఈ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది..

Related posts

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ భక్తుల సర్వదర్శనానికి 10గంటల సమయం

TV4-24X7 News

ఆ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు: నిర్మలా సీతారామన్

TV4-24X7 News

ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు

TV4-24X7 News

Leave a Comment