: త్వరలో నటుడు విజయ్ కొత్తపార్టీ?ప్రముఖ నటుడు విజయ్ త్వరలో కొత్తపార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి..తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు..ఈ నేపథ్యంలో చెన్నై సమీప పనయూర్‌లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు..పలుజిల్లాల నుంచి 150మంది నిర్వాహకులు పాల్గొన్నారు..మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది..
