Tv424x7
Andhrapradesh

ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది..అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది..”ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్‌ 41ఏ నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు? అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తాం. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదు” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది..

Related posts

విల్లురి భాస్కరరావు చేతుల మీదుగా సుమారు రెండు వందల మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు

TV4-24X7 News

TV4-24X7 News

గీతా ప్రచార సాధకులు గీతా గాన గంధర్వ ఎండూరి కృష్ణమూర్తి కి ఘన సన్మానం

TV4-24X7 News

Leave a Comment