తిరుపతి జిల్లా.. గూడూరు:విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. – అగ్నికి ఆహుతైన కారు..- తప్పిన పెను ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ వ్యక్తులు..వెంకటగిరి నుండి గూడూరు వైపు వస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయి దగ్ధమైన సంఘటన గూడూరు మండల పరిధిలోని తిప్పవరపాడు జంక్షన్లో జరిగింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న స్థానికులు గమనించి అందులో ఉన్న నలుగురు వ్యక్తులను హుటా హుటిన కారు అద్దాలు పగలగొట్టి బయటికి తీశారు. సురక్షితంగా వ్యక్తులు ప్రాణాలను కాపాడారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిమాపక వాహనం ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కారులో ఉన్న వ్యక్తులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారిగా హిందీలో మాట్లాడుతున్నట్టు తెలిసింది.

previous post