కడప /ప్రొద్దుటూరు నియోజకవర్గం లో 67శాతం బిసిలు ఉన్నారని అయితే నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి బిసిలకు ఏ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించలేదని బిసి నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం గాంధీ రోడ్డు లోని పద్మశాలియ కళ్యాణ మండపం నందు జరిగిన విలేఖరుల సమావేశం లో వారు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్నీ పార్టీలు బిసిలకు మాత్రమే టికెట్ ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. మా ఓట్లు మీకు సీట్లు చెల్లందన్నారు. ఒకవేళ టికెట్ కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తమ సత్తా చాటుదామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో చెన్నా సరళా దేవి, బొర్రా రామాంజనేయులు, గొర్రె శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు
