నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల పరదిలోని గోస్పాడు, చింతకుంట్ల, జూలేపల్లే నెహ్రూనగర్, తేళ్లపురి గ్రామాలలో బుధవారం 6కోట్ల22లక్షల వ్యయంతో 9 వ్యవసాయ సహకారం సంఘం… బహుళ ప్రయోజన సౌకర్యాల గోడౌన్ల మరియు గోస్పాడులో 35లక్ష్లలతో సచివాలయం, 47లక్ష్లలతో స్త్రీశక్తి భవన్ లను ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ప్రహల్లాదరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డా.శశికళరెడ్డి, నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వరరెడ్డి, తదితర నాయకుల ఆద్వర్యంలో ప్రారంభించారు. రైతు సోదరులు ఈ బహుళ ప్రయోజన గోడౌన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గోస్పాడు మండల పరిదిలో 5కోట్ల40లక్షల వ్యయంతో నేడు వ్యవయాస సహకారం సంఘం బహుల ప్రయోజనాల సౌకర్యాల గోడౌన్లను తొమ్మిది ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ గోడౌన్లను ప్రారంభించడం ద్వారా రైతులు పండించిన పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి ఆయా గ్రామాలలో సమీప గ్రామాలలో గోడౌన్ల సౌకర్యం ఉండటం ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రైవేట్ గోడౌన్లను ఆశ్రయించవలసిన అవసరంలేకుండా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోడౌన్లలో పంట దిగుబడులను నిల్వచేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ నాయకులు పుల్లయ్య, సుబ్రమణ్యం, కాంతారెడ్డి, పార్థసారధిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, భాస్కర్ రెడ్డి శివరామిరెడ్డి, కృష్ణారెడ్డి, కొండారెడ్డి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
