Tv424x7
National

విశ్వాస పరీక్షలో గెలిచిన కేజ్రీవాల్.. 2029 నాటికి ‘బీజేపీ విముక్త భారత్’ సవాలు

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విశ్వాస పరీక్ష (Confidence Motion)లో గెలుపొందారు. ప్రభుత్వంపై శుక్రవారంనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టగా, శనివారం సభలో చర్చ జరిగింది..అనంతరం జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో ఆయన సభా విశ్వాసం పొందారు. ఓటింగ్ సందర్భంగా 64 మంది ‘ఆప్‌’ ఎమ్మెల్యేలలో 54 మంది సభకు హాజరయ్యారు..దీనికి ముందు చర్చలో కేజ్రీవాల్ పాల్గొంటూ, సభలో తమ పార్టీకి మెజారిటీ ఉందన్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తుండటంతో విశ్వాస తీర్మానానికి వెళ్లామని చెప్పారు. బీజేపీ ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినా 2029 ఎన్నికల బీజేపీని నుంచి దేశానికి తమ పార్టీ విముక్తి కల్పిస్తుందని సవాలు చేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ ఫిరాయింపులకు పాల్పడలేదని, ఇద్దరు ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారని, కొందరికి ఆరోగ్యం బాగోలేదని, మరికొందరు ఢిల్లీలో లేరని చెప్పారు. అరెస్టుల ద్వారా ఆప్‌కు చరమగీతం పాడాలని బీజేపీ ఆలోచనగా ఉందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్టయితే పార్టీ కుప్పకూలుతుందని వారి అంచనాగా ఉందని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేయవచ్చునేమో కానీ కేజ్రీవాల్ ఐడియాలజీని ఎలా అరెస్టు చేస్తారని సీఎం ప్రశ్నించారు..

Related posts

వండర్ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ!

TV4-24X7 News

వడ్డీ రేట్లను తగ్గించిన HDFC బ్యాంక్

TV4-24X7 News

న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలి.. భారత ప్రధాన న్యాయమూర్తికి రిటైర్డ్ న్యాయమూర్తుల లేఖ

TV4-24X7 News

Leave a Comment