నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు..టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం తర్వాత పవన్ రాజమండ్రి వెళ్లనున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలతో రాజమండ్రిలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. కీలక నేతలతో ఎన్నికల గురించి చర్చించనున్నట్లు సమాచారం..
