Tv424x7
Andhrapradesh

జగన్ ప్రభుత్వం తన ఓటమి భయాన్ని కప్పి పుచ్చుకునేందుకు సిద్ధం సభ

జగన్ ప్రభుత్వం తన ఓటమి భయాన్ని కప్పి పుచ్చుకునేందుకు సిద్ధం అంటూ ఒక్కొక సభకు 40 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 300 కిలోమీటర్ల పైగ దూరం నుండి పేదప్రజలను తరలించి డప్పా కొట్టుకునే పబ్లిసిటీ ఈవెంట్ – NMd ఫరూక్, నంద్యాల టీడీపీ ఇంఛార్జి.ఈ సందర్భంగా పత్రిక సమావేశంలో NMd ఫరూక్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు 49 వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించిన జగన్ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేసిందన్నారు.అన్ని ఇర్రిగేషన్ ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి గాలికివొదిలేసారన్నారు.రాయలసీమ ప్రాంతానికి ఒక్క నూతన పరిశ్రమను ఒక్క కంపెనీని తీసుకురకపోగా ఉన్న కంపెనీల నుండి వాటాల కోసం ఈ జగన్ ప్రభుత్వం హింసించి వారిని పక్క రాష్ట్రాలకు వెళ్ళేటట్టు చేసిందన్నారు.సిద్ధం అంటూ సభలు పెడుతూ 300 /400 కిలోమీటర్ల నుండి ప్రభుత్వ యంత్రాగాన్ని ఉపయోగించి పేద ప్రజలను తరలించి పడిపోయిన జగన్ గ్రాఫ్ పెరుగుతుందని ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం జరుగుతుందన్నారు.ముఖ్యమంత్రి రాష్ట్రానికి తండ్రిలాంటి వారు, ఈ ఎండల్లో 300 కిలోమీటర్ల నుండి ప్రజలను తరలించి తన ప్రచారం కోసం వారి ప్రాణాలను బలి చెయ్యాలనుకోవడం దారుణం అన్నారు.ఈ ప్రచార సభ ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడి గారిని & పవన్ కళ్యాణ్ గారి పై అవాస్తవలను ప్రచారం చేస్తూ తిట్టడం తప్ప ప్రజలకు & రాయలసీమ ప్రాంతానికి తాను ఏం చేశాడో చెప్పలేక నేను బటన్ నొక్కాను మీరు బటన్ నొక్కండని చెప్పడం విడ్డురం అన్నారు. రాయలసీమ యువతకు ఉద్యోగాలు లేవు, ప్రతి ఏటా ఇస్తాన్నాన జాబ్ క్యాలెండర్ లేదు, పోలీసు టీచర్ ఉద్యోగాలు లేవు, కరువుతో అల్లాడుతూ ఊర్లకు ఊర్లు వలస వెళ్తుంటే వారి కోసం కనీసం ఆలోచించని ఈ ముఖ్యమంత్రి కి రాయలసీమకు రావడానికి అర్హత లేదన్నారు.ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో అధికారంలో రాబోతోందని తెలిసి ఐప్యాక్ టీం సూచనలతో ఇటువంటి ఛీప్ పబ్లిసిటీ ఈవెంట్లను చేస్తున్నారని, అరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు సిద్ధం అంటూ ఎన్ని సభలు పెట్టుకున్న ఎన్ని వందల కోట్ల అవినీతి సొమ్ము ఖర్చు చేసిన రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి కూటమి మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బైక్ వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ ఉండాలిట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు

TV4-24X7 News

సింహాచలం ఈవోని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు.

TV4-24X7 News

అనాథ శవానికి అంత్యక్రియలు

TV4-24X7 News

Leave a Comment