Tv424x7
Andhrapradesh

కుప్పకూలిన తేజస్‌.. ఇదే తొలి ప్రమాదం

జైసల్మేర్‌: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (IAF)కు చెందిన ఓ తేజస్‌ (Tajas) యుద్ధ విమానం నేలకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు..అప్రమత్తమైన పైలట్‌ సురక్షితంగా ముందుగానే బయటకు వచ్చేసినట్లు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు వెలికితీసేందుకుగానూ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వాయుసేన తెలిపింది..స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన యుద్ధ విమానాల్లో ‘తేజస్‌’ ఒకటి. 2016లో దీన్ని వాయుసేనలోకి చేర్చారు. 2001లో తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ మొదలు.. తేజస్‌ కూలిపోవడం ఇదే మొదటిసారి. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో ‘భారత్ శక్తి’ పేరిట సైనిక విన్యాసాలు కొనసాగుతోన్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు..

Related posts

చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు: జగన్ మేనమామ

TV4-24X7 News

వైకాపా సర్పంచ్ టిడిపి లో చేరిక

TV4-24X7 News

ఇంటర్మిడియట్‌లో కొత్త సిలబస్‌

TV4-24X7 News

Leave a Comment