Tv424x7
Andhrapradesh

రేపు వైజాగ్‌లో కాంగ్రెస్ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సాధన సభకు తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) హాజరుకానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు..ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఏపీకి వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ వైసీపీ, టీడీపీ, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగిస్తారని తెలిసింది. ఈ బహిరంగ సభలో జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీ, తెలంగాణ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఏపీ మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశముంది.పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నేతృత్వంలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మైదానాన్ని పరిశీలించారు. ఈ సమావేశానికి 70 వేల మంది హాజరవుతారని ఆశిస్తున్నామని, ఈ ప్రాంతానికి కీలకమైన వీఎస్పీ ప్రైవేటీకరణను వ్యతిరేకించడమే దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు..విశాఖ సమావేశం తర్వాత కాంగ్రెస్ తన తదుపరి సమావేశాన్ని గుంటూరులో నిర్వహించబోతోంది, అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సమావేశంలో ఏపీ రాజధానిగా అమరావతిపై కాంగ్రెస్ తన వైఖరిని వెల్లడించనుంది..

Related posts

జగన్ పై నుంచి ఫోకస్ తప్పించిన షర్మిల.. ఏం జరుగుతోంది?

TV4-24X7 News

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ

TV4-24X7 News

ప్రేమ పేరుతో నమ్మించి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

TV4-24X7 News

Leave a Comment