సిపిఐ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో వికలాంగుల భూ పోరాటం.కంప చెట్లు తొలగించి భూ పోరాటం నిర్వహించిన సిపిఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర. అభాగ్యులైన వికలాంగుల కోసం బద్వేల్ పట్టణంలో భూ పోరాటం నిర్వహించి గుడిసెలు వేయించి న సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర. శుక్రవారం నాడు సిపిఐ బద్వేల్ పట్టణ సమితి ఆధ్వర్యంలో 300 మంది వికలాంగులతో భూ పోరాటం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో వికలాంగులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని ఎన్నో తపాలుగా అధికారులను అధికారులను వేడుకొన్న వాళ్లు వికలాంగుల బోర్డును పట్టించుకోకపోవడంతో వికలాంగులే స్వచ్ఛందంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకునుటకు పూనుకున్నారని, వికలాంగులు గుడిసెలు వేసిన చోటనే వాళ్లకు ఇళ్ల పట్టాలు పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి వీరశేఖర్ పట్టణ సమితి కార్యదర్శి పి బాలు జిల్లా కమిటీ సభ్యుడు పి వెంకటరమణ సభ్యుడు ఏరియా కార్యవర్గ సభ్యుడు పివి రమణ, బద్వేల్ రూరల్ కార్యదర్శి ఇమ్మానియేల్ మండల కార్యదర్శి జి పెంచలయ్య, నాయకులు మునిరత్నం చిన్న షలోమి, వికలాంగుల కార్యదర్శి కదిరుల్ల అధ్యక్షుడు రమణయ్య ఖాదర్ బాషా మౌలాలి మునీంద్ర గురయ్య ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
