Tv424x7
Andhrapradesh

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టోకరా.. రూ. 2వేలు కట్టాడు, రూ. 31 లక్షలు పోగొట్టుకున్నాడు

మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాల శైలి కూడా మారిపోతోంది. ప్రజల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని లక్షలు దోచేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారు ఏదో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారో, నిరక్షరాస్యులో అంటే పొరబడినట్లే. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇలాంటి మోసాల బారినపడుతున్నారు.తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఏకంగా రూ. 31 లక్షలు పోగొట్టుకున్నాడు.హైదరరాబాద్‌ శివారుల్లోని అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధి నవ్యనగర్‌ కాలనీలో ఉంటున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి ఇటీవల ఓ మెసెజ్‌ వచ్చింది. పార్ట్ జాబ్‌ పేరుతో ఆ మెసేజ్‌ వచ్చింది. చిన్న చిన్న టాస్క్‌లు చేస్తే చాలు అకౌంట్‌లో డబ్బులు వచ్చి పడాతయని అవతలి వైపు నుంచి మెసేజ్‌ చేశారు. దీంతో అత్యాశకు పోయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి లింక్‌ను క్లిక్‌ చేశాడు. అవతలి వ్యక్తి ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశాడు.అయితే అంతకు ముందు టాస్‌ పూర్తి చేయాలంటే రూ. 2 వేలు చెల్లించాలి అంటే చెల్లించాడు. వెంటనే కమిషన్‌ రూపంలో కొంత డబ్బు చెల్లించారు. ఇంకా టాస్క్‌లు పెరగాలంటే మరికొంత డబ్బు చెల్లించాలని ఆదేశించారు. దీంతో అలాగే ఏకంగా రూ. 31 లక్షల వరకు చెల్లిస్తూ పోయాడు. తీరా డబ్బులు విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నిస్తే అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి గురువాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అలాంటి వారితో జాగ్రత్త..ఇటీవల పార్ట్ టైమ్‌ జాబ్‌ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. తొలుత వాట్సాప్‌కు మెసేజ్‌ చేసి టాస్క్‌ చేయాలంటూ సూచిస్తున్నారు. పొరపాటు వారి ఉచ్చులో పడితే ఇక అంతే సంగతులు. డబ్బులు వసూలు చేసే వరకు వదిలిపెట్టరు. ఇలాంటి మోసపూరిత మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు చెల్లించకూడదని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. మనకు ఉద్యోగం ఇచ్చే వ్యక్తి ఎప్పుడూ మన నుంచి డబ్బు ఆశించడనే సింపుల్‌ లాజిక్‌కు గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తే సింపుల్‌గా వాటిని అవైడ్ చేయడం ఉత్తమమని సలహాయిస్తున్నారు.

Related posts

సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న వాసుపల్లి

TV4-24X7 News

దుర్గాలమ్మ గుడి దగ్గర వేలంపేట ప్రసాద్ గార్డెన్స్ పలు ఏరియాలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు

TV4-24X7 News

ఏపీలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పు

TV4-24X7 News

Leave a Comment