శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇటీవల అరెస్టై జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు.సీదిరి అప్పలరాజుపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసి రాజకీయ కక్షతో అరెస్టు చేసిందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను జైలులో కలిసి పరామర్శించి, కుటుంబ సభ్యులకు జగన్ ధైర్యం చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.జగన్ పర్యటనకు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: