వరి సాగుకు దూరంగా ఉండండి.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి: మండల వ్యవసాయ అధికారి అమర్నాథరెడ్డి

వరి సాగుకు దూరంగా ఉండండి.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి: మండల వ్యవసాయ అధికారి అమర్నాథరెడ్డి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మూడిండ్లపల్లి గ్రామంలో నిర్వహించిన “పొలం పిలుస్తుంది” కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమర్నాథరెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు.ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో పాటు ప్రాజెక్టులకు కూడా తగినంత నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగును నివారించి, మినుము, కంది, పెసర, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.ప్రస్తుతం సాగులో ఉన్న మొక్కజొన్న, పసుపు, మినుము వంటి పంటలకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతుల ద్వారా నీటిని పొదుపుగా వినియోగించాలని తెలిపారు. ప్రభుత్వం ఈ పరికరాలను 90 శాతం సబ్సిడీతో అందిస్తోందని వివరించారు.అలాగే జూలై 31 వరకు పంటల బీమా నమోదు అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ, దిగుబడి ఆధారిత పథకం కింద అరటి, చెరకు, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, మినుము, కంది, జొన్న తదితర పంటలకు బీమా చేసుకోవచ్చని రైతులకు సూచించారు.ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన అన్ని పంటలను తప్పనిసరిగా ఈ- క్రాప్ లో నమోదు చేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, గ్రామ ఉద్యాన సహాయకురాలు జెరూసతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *