ప్రొద్దుటూరులో ప్లాస్టిక్‌ నివారణకు ఆటో డ్రైవర్ల మద్దతు

ప్రొద్దుటూరులో ప్లాస్టిక్‌ నివారణకు ఆటో డ్రైవర్ల మద్దతు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ చేపట్టిన స్వచ్ఛ సంకల్ప దీక్షకు ఆటో డ్రైవర్లు మద్దతు తెలిపారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ ఆటోలకు ప్లాస్టిక్‌ నివారణకు సంబంధించిన స్టిక్కర్లను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తూతీక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ స్వయంగా ఆటో నడిపి పాల్గొన్నారు. ప్లాస్టిక్‌ నివారణలో ఆటో డ్రైవర్లు అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు.

పట్టణ పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్‌ సూచించారు. ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కోరారు. ప్రొద్దుటూరును పరిశుభ్రమైన, ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మార్చేందుకు ప్రజలు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లు సహా ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *