పుట్టినరోజు వేడుకకు పిలిచి.. ప్రియురాలిపై మూడుసార్లు అత్యాచారం.. అయినా సరిపోలేదని దారుణ హత్య
జన్మదిన వేడుక ఆ యువతికి నూరేళ్ల ఆయువును తెచ్చిపెట్టాల్సింది పోయి, ఆమె ప్రాణాలనే బలి తీసుకుంది. నమ్మిన ప్రియుడే కామంతో కళ్లుమూసుకుని కడతేర్చిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
నితిన్ యాదవ్ అనే యువకుడు తన పుట్టినరోజు వేడుకల పేరుతో ప్రియురాలను ఒక హోటల్‌కు రప్పించాడు. ఇద్దరూ కలిసి పదో తరగతి, ఇంటర్ వరకు కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి బీఎస్సీ నర్సింగ్ చదువుతూ తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే పనిలో ఉంది.హోటల్ గదిలో పుట్టినరోజు వేడుక ముగిసిన తర్వాత, నితిన్ అత్యధిక మోతాదులో లైంగిక శక్తిని పెంచే మందులను (పొటెన్సీ-ఎన్హాన్సింగ్ మెడిసిన్) సేవించాడు. మత్తు తలకెక్కిన ఆ కామాంధుడు విచక్షణ కోల్పోయి ప్రియురాలపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక్కసారి కాదు.. మూడుసార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు.అయినా వాడి కామ వాంఛ తీరకపోవడంతో మళ్లీ మళ్లీ కావాలని వేధించాడు. తీవ్రమైన నొప్పితో, భయంతో ఆ యువతి తెగేసి నో చెప్పింది. ఇక తన వల్ల కాదంటూ ముఖం మీదే తేల్చిచెప్పింది.
యువతి ఎంతగా ప్రతిఘటించినా, కామంతో కళ్లు మూసుకుపోయిన నితిన్‌కు కోపం కట్టలు తెంచుకుంది. విచక్షణారహితంగా ఆమె తలను గోడకేసి బలంగా బాదాడు. తీవ్రగాపాలపాలైన ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.తన ఘాతుకం కారణంగా ప్రియురాలు మృతి చెందిందని గ్రహించిన ఆ రాక్షస ప్రియుడు, భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.సమస్య వచ్చినప్పుడు ఎదుటివారి ఇష్టాయిష్టాలను గౌరవించాల్సిందిపోయి, కామవాంఛ తీరలేదన్న అక్కసుతో నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఉదంతం తీవ్ర విషాదాన్ని నింపింది. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుని చదివించుకుంటున్న ఆ తల్లిదండ్రులు తమ కూతురి మృతి వార్త విని గుండెలు బాదుకుంటున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: