కల్లూరులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

ప్రొద్దుటూరు /కల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలను కల్లూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి, అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తదుపరి కార్యక్రమానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాగ సుబ్బారెడ్డి, ఓబుల్ రెడ్డి, కిరణ్, రాజా యాదవ్, సుబ్రహ్మణ్యం, బీసీ యాదవ్‌తో పాటు పలువురు గ్రామ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన ప్రజాసేవను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *